

ఐరన్ లోపాన్ని అనీమియా అంటారు. శరీరంలో సరిపడా ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు లేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఎర్ర రక్తకణాలు శరీరంలోని అన్ని కణజాలాలకు ఆక్సీజన్‌ను అందిస్తాయి. కానీ ఐరన్ తగినంతగా లేకపోతే ఈ ప్రక్రియ మందగించి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఐరన్ లోపం ఆరోగ్యానికి మంచిది కాదు మరియు భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది.
అనీమియా వంటి సమస్య ఉన్నవారిలో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా మందులతో ఈ సమస్యను నియంత్రించవచ్చు. కానీ దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు అందుకోవాలంటే సహజమైన మార్గాలను ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను డైట్లో చేర్చుకుంటే శరీరంలో ఐరన్ స్థాయి క్రమంగా పెరిగి, ఈ సమస్య తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

















.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!