

పాతకాలంలో పొలం పనులకు వెళ్లే వారు పొయ్యి ముట్టించకుండానే, నూనె ఉపయోగించకుండా ఈజీగా చేసే పొలం పచ్చడిని అన్నం లేదా టిఫిన్స్‌తో తినేవారు. తక్కువ పదార్థాలతో కొన్ని నిమిషాల్లో తయారయ్యే ఈ పచ్చడి ఆరోగ్యకరమైనది మరియు సహజ రుచిని అందిస్తుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర వంటి పదార్థాలతో ఈ పచ్చడి సిద్ధమవుతుంది.
ముందుగా పచ్చిమిర్చిని శుభ్రం చేసి, ఉల్లిపాయను ముక్కలు చేసి నీటిలో నానబెట్టాలి. రోట్లో జీలకర్రను దంచి, చింతపండు, వెల్లుల్లి, ఉప్పు వేసి మెత్తగా చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి కచ్చాపచ్చాగా దంచాలి. రోట్లో చేస్తే మరింత రుచిగా ఉంటుంది. మిక్సీలో కూడా కచ్చా టెక్స్చర్‌తో గ్రైండ్ చేసుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!