

మారుతున్న జీవనశైలితో పొట్ట కొవ్వు, ఫ్యాటీ లివర్ సమస్యలు పెరుగుతున్నాయి. నిపుణుల సూచనల ప్రకారం, వరుసగా 21 రోజుల పాటు సరైన విధంగా బొప్పాయి తింటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడంతో పాటు లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొట్ట బయటకు వచ్చినవారిలో ఫ్యాటీ లివర్ సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో వారు తమ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
బొప్పాయి నీరు, పీచుపదార్థం అధికంగా ఉండే పండు కావడంతో జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సాయంత్రం సమయంలో పండిన బొప్పాయి ముక్కలపై కొద్దిగా మిరియాల పొడి వేసుకుని తినడం మంచిది. బొప్పాయి తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు భారీ లేదా వేయించిన ఆహారాన్ని తీసుకోకుండా తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. రోజూ కొద్దిసేపు నడక వంటి వ్యాయామం చేస్తే ఫలితాలు వేగంగా కనిపిస్తాయి.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!