

స్మార్ట్ఫోన్ను అతిగా వాడటం వల్ల మెదడు పనితీరు, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి దెబ్బతింటున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రీల్స్, షార్ట్ వీడియోలు నిరంతరం చూడటం మెదడును అలసటకు గురి చేసి, మానసిక ఆందోళనను పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు అవసరమైన హార్మోన్ల విడుదలను అడ్డుకుని నిద్రలేమికి దారితీస్తుందని డాక్టర్లు తెలిపారు. దీర్ఘకాలంలో ఇది రోగనిరోధక శక్తి తగ్గడమే కాకుండా గుండె సమస్యల ముప్పును కూడా పెంచుతుంది.
కేవలం 72 గంటలపాటు స్మార్ట్ఫోన్ వినియోగాన్ని తగ్గిస్తే మెదడు తిరిగి ఉత్తేజితమై ఆరోగ్యం మెరుగుపడుతుంది. తాజా అధ్యయనాలు ఫోన్ వాడకం తగ్గించడం వల్ల మెదడులో రివార్డ్ ప్రాసెసింగ్, ఇంపల్స్ కంట్రోల్ ప్రాంతాల్లో సానుకూల మార్పులు వస్తాయని వెల్లడించాయి. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి చిన్న బ్రేక్ తీసుకోవడం, నెలలో కనీసం మూడు రోజులు ఫోన్ వినియోగాన్ని తగ్గించడం మెదడుకు ‘బ్రెయిన్ రీసెట్’ లా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!