

బరువు తగ్గాలంటే అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జపాన్ ప్రజలు రోజుకు మూడు పూటలా అన్నం తింటూ ప్రపంచంలోనే అత్యంత సన్నగా, ఆరోగ్యంగా ఉండటం దీనికి ఉదాహరణ. అన్నం తినడం కాదు, ఎంత పరిమాణంలో, ఎలా తింటున్నామన్నదే బరువు నియంత్రణలో కీలకమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
జపాన్ డైట్లో చిన్న పోర్షన్లు, మిసో సూప్ వంటి తక్కువ క్యాలరీల ఆహారం, మైండ్‌ఫుల్ ఈటింగ్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. భోజన సమయంలో నెమ్మదిగా తినడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అవసరానికి మించి క్యాలరీలు తీసుకునే అవకాశం తగ్గుతుంది.
అలాగే రోజువారీ నడక, సైక్లింగ్ వంటి శారీరక చురుకుదనం, సమతుల్య ఆహారం కూడా వారి ఆరోగ్య రహస్యమని వైద్యులు పేర్కొంటున్నారు. అన్నంతో పాటు కూరగాయలు, ప్రోటీన్లు సమపాళ్లలో తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా శరీరం ఫిట్‌గా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!