

గోల్డెన్ మిల్క్ అంటే పాలలో చిటికెడు పసుపు పొడి కలిపి తాగడం. వైద్యుల మాటల్లో, ఇందులోని కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, రోగ నిరోధక గుణాలు కలిగి ఉండటం వల్ల శరీరంలో వాపులు, నొప్పులు తగ్గుతాయి. డాక్టర్లు చెబుతున్నట్లుగా, పసుపు పాలు రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే జీర్ణక్రియ మెరుగుపడి జ్ఞాపకశక్తి పెరగడానికీ తోడ్పడతాయి.
వైద్య నిపుణుల ప్రకారం, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పసుపు పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది ప్రయోజనకరమని డాక్టర్లు చెబుతున్నారు. అల్లం, దాల్చిన చెక్క కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు తోడ్పడుతుంది. ఆర్థరైటిస్, గుండె జబ్బులు, అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా గోల్డెన్ మిల్క్ ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!