

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ హాలీవుడ్ నటి ఎమిలియా క్లార్క్ తన 20వ ఏటలో రెండుసార్లు బ్రెయిన్ అనూరిజం బారిన పడిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. మెదడులోని రక్తనాళం గోడ బలహీనపడి బెలూన్‌లా ఉబ్బిపోవడాన్ని బ్రెయిన్ అనూరిజం అంటారు. ఇది చిన్నదిగా ఉన్నప్పుడు లక్షణాలు కనిపించకపోయినా, పగిలితే మెదడులో రక్తస్రావం జరిగి ప్రాణాపాయ పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎమిలియా క్లార్క్‌కు రెండు సార్లు అత్యవసర శస్త్రచికిత్సలు జరగగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు.
వైద్యుల ప్రకారం అధిక రక్తపోటు, ధూమపానం, మద్యం సేవించడం, వంశపారంపర్య కారణాలు బ్రెయిన్ అనూరిజం ప్రమాదాన్ని పెంచుతాయి. తీవ్రమైన ఆకస్మిక తలనొప్పి, చూపు సమస్యలు, వాంతులు, మెడ బిగుసుకుపోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. CT స్కాన్, MRI, యాంజియోగ్రఫీ వంటి పరీక్షల ద్వారా సమస్యను గుర్తించి, అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స లేదా ఇతర చికిత్సలు అందిస్తారు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన లక్షణాలు లేదా సమస్యలు ఉంటే తప్పనిసరిగా నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!