

దంతాల ఆరోగ్యం సరిగా లేకపోతే అది మొత్తం శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు, దంత క్షయం లాంటివి నిర్లక్ష్యం చేస్తే మధుమేహం, గుండె జబ్బులు లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. డాక్టర్ల మాటల్లో చెప్పాలంటే, చాలా మంది నోటిలో చిన్న సమస్య వచ్చినా పట్టించుకోరు, ఆలస్యంగా డెంటిస్టును కలుస్తారు. ఇదే పెద్ద సమస్యగా మారి ప్రాణాంతకం కూడా కావొచ్చని డాక్టర్లు తెలిపారు.
డాక్టర్లు మరోసారి స్పష్టం చేస్తున్న విషయం ఏంటంటే, సంవత్సరంలో కనీసం రెండు సార్లు అయినా డెంటల్ చెకప్ చేయించుకోవాలి. ఎక్స్ రేలు, చెకప్స్ ద్వారా కేవిటీస్, ఇన్ఫెక్షన్స్, పగుళ్లు, కణితులు ముందుగానే గుర్తించవచ్చని డాక్టర్లు అన్నారు. దంతాలు బలంగా ఉంటే వయస్సు పెరిగినా అన్ని ఆహారాలు తినగలుగుతాం, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. నోటి శుభ్రత వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నవ్వు మరింత ఆకర్షణీయంగా ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!