

చియా మరియు సబ్జా గింజలు రెండూ మొక్కల ఆధారిత హైడ్రేషన్ వనరులు అయినప్పటికీ, వాటి పోషక విలువల్లో స్వల్ప తేడాలు ఉన్నాయి. చియా గింజల్లో ప్రోటీన్, పీచుపదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉండి బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మరోవైపు సబ్జా గింజలు శరీరానికి చల్లదనాన్ని అందిస్తూ, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రెండు గింజలు కరిగే పీచుపదార్థానికి అద్భుతమైన మూలాలు కావడంతో కడుపులో ఉబ్బి ఎక్కువసేపు ఆకలి వేయకుండా నియంత్రిస్తాయి.
అయితే వీటిని సరైన విధంగా తీసుకోవడం చాలా ముఖ్యం. చియా గింజలను రాత్రంతా నీటిలో లేదా పాలలో నానబెట్టి తీసుకోవడం ఉత్తమం. సబ్జా గింజలను కనీసం 15 నుండి 20 నిమిషాలు నానబెట్టాలి. ఇవి బరువు తగ్గడమే కాకుండా శరీరానికి శక్తిని అందిస్తూ, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. సరైన మోతాదు, సమతుల్య ఆహారం, చురుకైన జీవనశైలితో కలిపి తీసుకుంటే ఈ గింజలు ఫిట్నెస్లో మంచి ఫలితాలు ఇస్తాయి.
గమనిక: ఇది సాధారణ సమాచారం మాత్రమే. వ్యక్తిగత సలహా కోసం నిపుణులను సంప్రదించాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!