
.webp&w=3840&q=75)
నాన్‌వెజ్ ఆహారంలో చికెన్, మటన్, ఫిష్ వంటి పలు ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. రెడ్ మీట్లో బీఫ్, మటన్, పోర్క్ వస్తాయి, వైట్ మీట్లో చికెన్, ఫిష్, రొయ్యలు, పక్షి మాంసం ఉంటాయి. మాంసాహారం తినడంపై చాలారకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు చికెన్ మంచిదంటారు, ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కొందరు మటన్ మంచిదంటారు, ఎందుకంటే ఇది ప్రోటీన్ మరియు ఫ్యాట్ సమతుల్యంగా ఉంటుంది. మరికొందరు చేపలు, రొయ్యలు తినడమే ఆరోగ్యానికి ఉత్తమం అని సూచిస్తారు.
కానీ కొత్త అధ్యయనాలు సూచిస్తున్నాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం, రెడ్ మీట్ మరియు వైట్ మీట్ రెండూ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్‌కు కారణమవుతాయి. అంటే, ఏ మాంసం అయినా కొలెస్ట్రాల్ పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది.
చెడు మరియు మంచి కొలెస్ట్రాల్ (LDL & HDL) విషయానికి వస్తే, చెడు కొలెస్ట్రాల్ (LDL) శరీరానికి హానికరం చేస్తుంది, గుండె జబ్బులు మరియు బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. మాంసంలో ఉండే “లో డెన్సిటీ లైపోప్రొటీన్స్” (LDL) చెడు కొలెస్ట్రాల్‌గా మారి గుండె వ్యాధులను కలిగించవచ్చు. రెడ్ మీట్లో ఇది ఎక్కువగా ఉంటుంది, చికెన్ కొంచెం తక్కువ, చేపలు మరియు రొయ్యలు మరింత హెల్దీగా ఉంటాయి.
జంతు వెన్న, జంతువుల కొవ్వు, పౌల్ట్రీ స్కిన్ కూడా LDL ని పెంచుతాయి. కొలెస్ట్రాల్ పెరుగుదల కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
సారాంశంగా చెప్పాలంటే, ఆరోగ్య పరంగా చేపలు > చికెన్ > మటన్ అని చెప్పవచ్చు. ఏ మాంసం అయినా కొలెస్ట్రాల్ ముప్పు ఉంటుంది, కాబట్టి తక్కువ మోతాదులో, సమతుల్యంగా తినడం ఉత్తమం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!