

పిజ్జా, బర్గర్, నూడుల్స్ వంటి ఆహారాలతో పాటు ఎక్కువగా వాడే టొమాటో కెచప్‌లో పోషకాలు లేవని, ఆరోగ్యానికి మేలు కంటే హానే ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామికంగా తయారయ్యే కెచప్‌లలో అధికంగా చక్కెర, ఉప్పు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, అవసరమైన మైక్రో న్యూట్రియెంట్స్ దాదాపు సున్నా కావడంతో ఇది కేవలం రుచికే పరిమితమవుతుందని వైద్యుల అభిప్రాయం.
డాక్టర్ల ప్రకారం, కెచప్‌ను తరచూ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, ఎసిడిటీ, జీర్ణ సమస్యలు, కీళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లు మరియు అలర్జీలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అధిక సోడియం, ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే అమ్మ చేసే టొమాటో పచ్చడి లేదా ఇంట్లో తయారుచేసుకున్న తాజా సాస్‌ను వాడటం మేలని, బయట దొరికే కెమికల్స్‌తో కూడిన కెచప్‌ల విషయంలో జాగ్రత్త అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు.
గమనిక : మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.








.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!