

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. కానీ ఈ సినిమాకు ముందే ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్ విశ్వంభర గురించి అభిమానులలో భారీ ఆసక్తి నెలకొంది. భోళా శంకర్ వంటి నిరాశ పరచిన సినిమాల తర్వాత, విశ్వంభర చిరంజీవి సినిమాల్లోని పెద్ద ఫాంటసీ ప్రాజెక్ట్‌గా హైప్ సృష్టించింది.
సినిమా వి.ఎఫ్.ఎక్స్ పనుల్లో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్న కారణంగా విడుదల ఆలస్యం అయింది. అయితే, ఫైనల్ గా ఈ భారీ సినిమా రిలీజ్ అప్డేట్ కోసం ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రిలీజ్ డేట్ ని మేకర్స్ అతి త్వరలోనే అనౌన్స్ చేయాలని చూస్తున్నారట.
ఇదివరకే సినిమాని మేకర్స్ వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కి తెస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. కానీ డేట్ మాత్రం రివీల్ చేయలేదు. ఆ డేట్ ని ఇప్పుడు ప్రకటించనున్నారట. మరి ఇదెప్పుడు అనేది వేచి చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!