

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో కొత్త మైలురాయిగా నిలిచే సినిమా #King100 ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కింగ్ నాగార్జున వందో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి "లాటరీ కింగ్" అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ అయితే.. ఈ మూవీలో కింగ్ నాగార్జున ఒక్కరూ కాదు.. ఇద్దరూ కాదు.. ముగ్గురితో రొమాన్స్ చేయబోతున్నారట. ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరంటే?
తాజా అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో మూడు హీరోయిన్లు నటించబోతున్నారు. అందులో సీనియర్ నటి టబు (Tabu) కీలక పాత్రలో కనిపించనున్నారు. గతంలో "నిన్నే పెళ్లాడతా", "వైల్డ్ డాగ్" వంటి సినిమాల్లో నాగార్జున-టబు జోడీకి ప్రేక్షకులు మంచి స్పందన ఇచ్చారు. మళ్లీ ఈ జంట స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అలాగే యువ నటి సుశ్మిత భట్ (Sushmitha Bhat) కూడా ఈ చిత్రంలో హీరోయిన్గా ఎంపికయ్యారు. ఆమె ఇప్పటికే కన్నడ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. టాలీవుడ్లో ఆమెకు పెద్ద అవకాశం అవుతుందని భావిస్తున్నారు. మూడో హీరోయిన్ పాత్ర కోసం ప్రస్తుతం మేకర్స్ ప్రముఖ నటీమణులతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆ వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.
నాగ్ - అనుష్క కాంబినేషన్ మళ్లీ?
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ సినిమాలో మరో హీరోయిన్గా అనుష్క శెట్టిను తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డాన్, రగడ, ఢమరుకం, సోగ్గాడే చిన్నినాయనా వంటి సినిమాల్లో నాగార్జున, అనుష్క జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ జంట మళ్లీ కలిస్తే, సినిమా మీద మరింత హైప్ పెరగడం ఖాయం. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.















కామెంట్స్ (1)
Big expectations on this combo!