
జనరల్

‘మ్యాన్ ఆఫ్ ది మాసెస్’ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో భారీ సందడి నెలకొంది. సినిమా అప్డేట్స్తో పాటు మరోసారి ఆయన రాజకీయ ప్రవేశంపై చర్చ మొదలైంది. తన తాతగారు, దివంగత ఎన్టీఆర్ మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావచ్చని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లో సాధించిన విజయంతో ఈ చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి. అయితే తమిళనాడు, తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా క్రేజ్ ఒక్కటే రాజకీయ విజయానికి సరిపోదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!