

వారణాసి టైటిల్ వచ్చేసిన తర్వాత, ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే--ఈ సినిమాలోని విలన్ ‘కుంభా’ పాత్ర. ప్రియాంక చోప్రా, మహేష్ బాబు లుక్స్ మొత్తం పాజిటివ్ వేవ్స్ తెచ్చేశాయి. కానీ పృథ్వీరాజ్ విలన్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన తెప్పించింది. రాజమౌళి సినిమా విలన్ అంటే పెద్ద మిస్టరీ, భారీ ఇంపాక్ట్,కానీ ఈ పోస్టర్ ఎందుకు ఈ సింపుల్గా ఉంది? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ-ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న థియరీ మాత్రం కుతూహలంగా ఉంది. ‘కుంభా’ అనే పేరే అసలు క్లూ అంటున్నారు. ఇది సాధారణ పేరు కాదు--రామాయణంలోని అత్యంత శక్తివంతమైన పాత్ర ‘కుంభకర్ణుడు’కి డైరెక్ట్ రిఫరెన్స్ అని టాక్. ఆరు నెలలు నిద్రపోయి, ఆరు నెలలు యుద్ధానికి లేస్తాడు. తన శరీరం దేవతల ఆయుధాలకూ జడచూపేంత శక్తి.
రాముడికి కూడా అతడే పెద్ద సవాలు.
అదేలా- పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్లో చేతులు, కాళ్లు చచ్చుబడి వీల్చేర్లో చూపించడం--అది కేవలం గిమ్మిక్ కాదు, కుంభకర్ణుడి చివరి యుద్ధాన్ని ప్రతీకాత్మకంగా చూపించినట్టు ఉందని అంటున్నారు. మహేష్ బాబు పాత్ర రాముడి ప్రేరణతో వస్తుందని రాజమౌళి ఇప్పటికే హింట్ ఇచ్చాడు. కాబట్టి ఈ సినిమాలో రామ–కుంభకర్ణుల మోడర్న్, సైకాలజికల్, రీరైటెన్ కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చని బలమైన జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇది నిజం అయితే,వారణాసి విలన్ లుక్ సింపుల్ కాదు--దాని వెనుక దాగి ఉన్న శక్తి మాత్రం మహా శక్తివంతమైనది.
ఇంకా రాజమౌళి దాంట్లో ఏ ట్విస్ట్ పెట్టాడో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆగలేకపోతున్నారు!











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!