

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి విడుదలైన ది రాజాసాబ్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినప్పటికీ, ప్రభాస్ విజయాపజయాలను పక్కనబెట్టి తన కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఒకవైపు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్లో పాల్గొంటూ, మరోవైపు స్పిరిట్, కల్కి 2 సినిమాల కోసం సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభాస్ ఫోటో పెద్ద చర్చకు దారితీసింది.
‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. నిర్మాణాన్ని టీ- సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ కలిసి చేపట్టగా, సంగీతాన్ని హర్షవర్ధన్ రమేశ్వర్ అందిస్తున్నారు. కీలక పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్టు వార్తలు ఉన్నాయి. ప్రభాస్ తండ్రి పాత్ర కోసం మొదట చిరంజీవిని సంప్రదించగా, ఆయన నిరాకరించారట. ప్రస్తుతం ఆ పాత్రకు మమ్మూట్టీ పేరు పరిశీలనలో ఉందని వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లో గాయాలతో కనిపించిన ప్రభాస్ లుక్ ఆసక్తి రేపింది. హీరోయిన్గా త్రిప్తి దిమ్రి నటిస్తున్నారు. ఇప్పుడు అద్దం ముందు సిగార్ వెలిగిస్తున్న ప్రభాస్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు దీన్ని ‘స్పిరిట్’ లీక్ స్టిల్గా షేర్ చేస్తున్నారు. కానీ అది నిజంగా సినిమా సెట్స్ నుంచి లీక్ అయిందా? లేక AI ద్వారా రూపొందించిన ఫ్యాన్ మేడ్ ఫోటోనా? అన్నది స్పష్టత లేదు. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. ఏది నిజమైనా, ఆ లుక్ మాత్రం అభిమానులను బాగా ఆకట్టుకుంది. ‘స్పిరిట్’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!