
గాసిప్స్

టాలీవుడ్ స్టార్ జంటగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న పేర్లతో ఓ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్డు బయటకు రావడంతో అభిమానుల్లో భారీ చర్చ మొదలైంది.
వైరల్ అవుతున్న ఆహ్వాన పత్రికలో ఈ నెల 26 న వివాహం జరగనున్నట్లు, అలాగే వచ్చే నెల 4 న హైదరాబాద్లో ఘనంగా విందు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొనబడింది. దీంతో ఈ వార్త నిజమా కాదా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.
అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో ఇది నిజమైన పెళ్లి వార్తనా లేక అభిమానులు రూపొందించిన కార్డా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ కార్డు సోషల్ మీడియాలో వైరల్గా మారి చర్చనీయాంశంగా నిలిచింది.

_1771477764226.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!