
న్యూస్

ఈ సంక్రాంతి కానుకగా మన దక్షిణాది సినిమా నుంచి పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆల్రెడీ లాక్ అయ్యి ఉన్న సంగతి తెలిసిందే. మరి రేపు(jan 9th) రిలీజ్ కావాల్సిన ప్రభాస్, విజయ్ సినిమాల్లో, విజయ్ నటించిన జన నాయగన్ (Jana Nayagan) కి ఊహించని సమస్యలు ఎదురైనందున ఈ సినిమాను వాయిదా వేసారు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో, టాలెంటెడ్ హీరో కార్తీ నటించిన చిత్రం వా వాథియర్, తెలుగులో అన్నగారు వస్తారు లైన్లోకి రావచ్చని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. జన నాయగన్ ఈ సంక్రాంతి బరిలో రాదు అని మాత్రం కన్ఫర్మ్ అయితే కార్తీ సినిమా ఈ సీజన్లో విడుదల కావచ్చని అంచనా. ఈ పరిస్థితిలో, జన నాయగన్ కొత్త రిలీజ్ డేట్ పట్ల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందువల్ల ఈ సంక్రాంతికి, కోలీవుడ్ నుంచి ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!