
%20(1).png&w=3840&q=75)
నటులు విజయ్–రష్మిక మందన్నా పెళ్లి తేదీపై సోషల్ మీడియాలో ఓ డేట్ వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో వీరిద్దరి వివాహం ఘనంగా జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఇరు కుటుంబ సభ్యులు కలిసి ఈ తేదీని ఫైనల్ చేశారని, డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఉదయపూర్‌లో గ్రాండ్‌గా పెళ్లి నిర్వహించనున్నారని సమాచారం. అక్కడకు ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువమందినే ఆహ్వానించనున్నట్లు, హైదరాబాద్‌లో తరువాత భారీ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.
ఇక గత అక్టోబర్‌లో విజయ్ ఇంట్లోనే చాలా సింపుల్‌గా, కొద్దిమంది బంధుమిత్రుల మధ్య విజయ్–రష్మిక నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఎంగేజ్మెంట్ అనంతరం కూడా ఈ విషయాన్ని ఇద్దరూ బయటపెట్టలేదు. తమ వ్యక్తిగత విషయాలను మీడియాకు దూరంగా ఉంచాలన్న నిర్ణయంతోనే పెళ్లి సంబంధిత వివరాలపై అధికారిక ప్రకటనలు చేయడం లేదని సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!