

జూన్ మొదటి వారంలో విడుదల కానున్న పెద్ది సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ ఊపందుకోనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాకు మంచి టాక్ వస్తే జూన్ మొత్తం బాక్సాఫీస్‌పై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత వరుసగా పలు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో థియేట్రికల్ బిజినెస్‌కు మళ్లీ ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆగస్టు నెల ఇప్పటికే భారీ సినిమాలతో బిజీగా కనిపిస్తోంది. నాని నటిస్తున్న ది ప్యారడైస్ ఆగస్టు 21న విడుదల కానుండగా, శర్వానంద్ భోగి ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ నటిస్తున్న ఇరుముడి కూడా ఆగస్టులోనే విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి మంచి బజ్ ఏర్పడింది. మరోవైపు విశ్వంభర కూడా ఆగస్టు రేసులో ఉండొచ్చనే ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!