ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది ఒక వార్త ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ హైప్డ్ మూవీకి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జాయిన్ అయ్యిందట! అదే కాదు, ఆమెని సినిమా కోసం తీసుకోవడమే కాదు ఆ డీల్ మొత్తం విన్నా షాక్ అవ్వాల్సిందే! వినిపిస్తున్న టాక్ ప్రకారం, ప్రియాంక డేట్స్ సెట్ చేయించడం, షూట్ వరకు ఆమెను బైండ్ చేయించడం కోసం నిర్మాతలు కోట్ల రూపాయల ఫీ చెల్లించాల్సి వస్తోందట. ఇప్పుడు ఆమె స్థాయి గ్లోబల్ స్టార్దిగా మారడంతో, ఆమెను లీడ్‌గా చూపించేందుకు, అంతర్జాతీయంగా ప్రమోట్ చేయించేందుకు భారీ ఖర్చులు పెట్టుతున్నారట. అయితే, అసలు షాక్ ఏమిటంటే ప్రియాంక ప్రతి సారి ఇండియా–అమెరికా ట్రావెల్ చేసే సమయంలో ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్‌లోనే వెళ్తుందట!
ఒకవైపు టికెట్ ధరే 10 లక్షల రూపాయల దాకా ఉంటుందని, ఒక్కో ట్రిప్‌కే నిర్మాతల ఖర్చు గగనాన్ని తాకుతుందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఆమె మళ్లీ హైదరాబాద్‌కి వచ్చిందట, అది కూడా చిన్న స్టే కోసం అంటే మరో సారి ఫస్ట్ క్లాస్ ట్రిప్ కదా! ఇక ఆమె భారత్‌కి వచ్చిన తర్వాత లగ్జరీ సూట్స్, ప్రత్యేక వాహనాలు, స్టైలిస్టుల టీమ్, సెక్యూరిటీ, స్పెషల్ హాస్పిటాలిటీ అన్నీ ప్రీమియం లెవల్లోనే ఉంటాయట. ఇది అంతా కలిపి నిర్మాతల ఖర్చు బాగా పెంచేస్తోంది.
ప్రియాంక లాంటి స్టార్‌ని తీసుకోవడం ప్రాజెక్ట్‌కి మేజర్ అడ్వాంటేజ్ అయినా, ఖర్చు పరంగా మాత్రం ఇది రిస్కీ గేమ్ అని అనిపిస్తోంది. ఆమె ఫీ, ట్రావెల్, స్టే, బ్రాండ్ టై-అప్స్ అన్నీ కలిపి చూసుకుంటే, సినిమా బడ్జెట్లో పెద్ద షేర్ ప్రియాంకకే వెళ్తోంది. అయినా నిర్మాతలు నమ్మకం కోల్పోలేదు ఆమె గ్లోబల్ పాపులారిటీతో పాటు, రాజమౌళి విజన్, మహేష్ బాబు క్రేజ్ కాంబినేషన్‌తో సినిమా పాన్-ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లో బ్లాక్‌బస్టర్ అవుతుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఇప్పటికే ప్రిపరేషన్స్ కూడా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి కాబట్టి ఈ సినిమా గ్లోబల్ లెవల్ బ్లాక్‌బస్టర్‌గా రాబోతుందన్న మాట నిజమే!























కామెంట్స్ (1)
Priyanka power 💥