

సినిమా ఇండస్ట్రీలో అందరికీ సొంత బుర్రలు వుండవు. మిత్రుల మాట, నమ్మిన వారి సలహా, తమ సర్కిల్ జనాల సూచనలు తీసుకుని నిర్ణయాలను మార్చుకుంటూ వుంటారు. ఒక్కోసారి ఇది ప్లస్ అవుతుంది. ఒక్కోసారి ఇది మైనస్ అవుతుంది.
టాలీవుడ్ లో ఓ వర్ధమాన నటి. చెప్పుకోదగ్గ సినిమాలే చేసారు. కానీ ఇంకా చకచకా అవకాశాలు తలుపు తట్టడం లేదు. తనలో గ్లామర్ కంటెంట్ పుష్కలంగా వుందని చాటి చెప్పేందుకు ఇన్ స్టాలో బోలెడు గ్లామర్ ఫొటోలు అప్ లోడ్ చేస్తూనే వుంటారు. చాలా తెలివిగా అందాలు వొలకపోస్తూ ఫోజులు ఇస్తుంటారు. అయినా కూడా అవకాశాలు అంతగా తలుపుతట్టడం లేదు. ఇలాంటి టైమ్ లో ఓ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ ముగ్గురు హీరోయిన్లు వున్న కథ. అయినా ఓకె అన్నారు. మంచి పాత్ర, మంచి కథ, మంచి బ్యానర్ ఇంకా చాలా చాలా మంచి..మంచి అని.
కానీ అంతలోనే ఆ అమ్మాయి సర్కిల్ జనాలు ఎవరో టచ్ లోకి వచ్చారు. ఏం చేస్తున్నావు అంటే ఈ సినిమా ఓకె అన్నా అంటూ వైనం వివరించింది. ఆ నిర్మాతకు సినిమా చేస్తావా.. ఆ బ్యానర్ లో సినిమానా.. ఇంకా ఇంకా అంటూ బ్రెయిన్ వాష్ చేసేసారట. దాంతో నిర్మాతకు ఫోన్ అమాయకంగా, అందరూ ఇలా అంటున్నారండీ... అంటూ పూస గుచ్చినట్లు చెప్పేసి, ఆ పాత్ర చేయను అని డిసైడ్ అయినట్లు వివరించారట. మంచి చాన్స్ పోగొట్టున్నదీ హీరోయిన్ అంటూనే, అలా ఆమెకు బ్రెయిన్ వాష్ చేసిన వారి మీద కారాలు మిరియాలు నూరుతున్నాడట ఆ నిర్మాత.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!