

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ చిత్రం షూటింగ్ పూర్తికాకముందే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ బడ్జెట్, గ్రాండ్ స్కేల్, బలమైన నటీనటుల బృందంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఇటీవల విడుదలైన గ్లింప్సెస్, పాత్రల పరిచయ వీడియోలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలోని ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్, ఎమోషన్ కలబోసిన ఈ సన్నివేశం ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. నాని కథానాయకుడిగా నటిస్తుండగా, సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇంకా షూటింగ్లో కీలక భాగం మిగిలి ఉన్నప్పటికీ, సెట్స్ నుంచి వస్తున్న సానుకూల వార్తలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!