

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘స్పిరిట్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతుండగా, ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్, వంగా కలయిక కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
న్యూ ఇయర్‌ను ప్రత్యేకంగా ఉపయోగించుకోవడం సందీప్ రెడ్డి వంగా స్టైల్‌గా మారింది. గతంలో ‘యానిమల్’ సినిమా ఫస్ట్ లుక్‌ను న్యూ ఇయర్ నైట్ విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు అదే తరహాలో ఈ న్యూ ఇయర్ నైట్‌కే ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఫస్ట్ లుక్కు సంబంధించిన షూట్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. అంతకుముందు విడుదలైన వాయిస్ ప్రోమోకు మంచి స్పందన రావడంతో, ఇప్పుడు పోస్టర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ‘యానిమల్’ పోస్టర్ రణబీర్ కపూర్‌తో ఇంటర్నెట్ను షేక్ చేసినట్టే, ప్రభాస్‌తో ‘స్పిరిట్’ కూడా భారీ ఇంపాక్ట్ చూపిస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!