

తమిళ సినీ ఇండస్ట్రీలోని పెద్ద సినిమాలు జన నాయకన్ (థలపతి విజయ్) మరియు పరశక్తి (శివకార్తికేయన్) రాబోయే 2026 సంక్రాంతికి థియేటర్లలో ఢీ కొట్టబోతున్నాయి. అయితే సినిమాలు రిలీజ్ కాకముందే సోషల్ మీడియాలో మాటల యుద్ధం మొదలైంది!
ఇటీవల పరశక్తి టీం సోషల్ మీడియాలో తమ మొదటి సాంగ్ ఆది అలయే యూట్యూబ్‌లో 15 మిలియన్ వ్యూస్ దాటినట్లు ప్రకటించింది.
వారు రాసిన క్యాప్షన్ –
“#Parasakthi First Single crossed 15 Million+ ORGANIC Views on YouTube. IYKYK.”
ఈ "ఆర్గానిక్ వ్యూస్" మరియు "IYKYK (If You Know You Know)" పదాలు అనేకమంది దృష్టిని ఆకర్షించాయి. కొందరు అభిమానులు ఇది విజయ్ సినిమా జన నాయకన్లోని థలపతి కచేరీ పాటపై పరోక్ష డై అనుకుంటున్నారు.
థలపతి కచేరీ మూడు రోజుల్లో 35 మిలియన్ వ్యూస్ సాధించడంతో, కొందరు “ఆర్గానిక్ వ్యూస్” అన్న పదం ద్వారా పరోక్షంగా పోలిక చూపారని అంటున్నారు.
నెటిజన్లలో కొందరు దీన్ని ఉద్దేశపూర్వక వ్యంగ్యంగా భావిస్తుండగా, మరికొందరు సాధారణ ప్రమోషన్ మాత్రమేనని అంటున్నారు. కానీ ఇలాంటి పోస్టులు విజయ్ – శివకార్తికేయన్ అభిమానుల మధ్య ఉన్న ఫ్యాన్ వార్స్‌కి మరింత మంటలు పెట్టే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
తనంతట తానుగా విజయ్‌కు అభిమానిగా ఉన్నట్టు ఎస్కే చెప్పిన నేపథ్యంలో, ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో అవసరంలేని వివాదాలు రేపుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.










కామెంట్స్ (1)
తమిళ సినీ వేదిక మళ్లీ హీట్ అవుతోంది!