

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జైలర్ 2. మొదటి భాగమైన జైలర్ భారీ విజయాన్ని సాధించడంతో, ఈ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమా, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనం సృష్టిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పలువురు స్టార్ నటులు క్యామియో పాత్రల్లో కనిపించనున్నారు.
జైలర్ సినిమాలో నటించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ తో పాటు.. బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మిథున్ చక్రవర్తి జైలర్ 2 సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, రమ్యకృష్ణలతో పాటు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో భాగమవుతున్నారన్న వార్తలకు బలమైన ఆధారం లభించినట్లైంది. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!