

ఇది ఏఐ యుగం. సిజి యుగం దాటేసింది. తెల్లవారి లేస్తే సోషల్ మీడియా నిండా ఏఐ టూల్స్ తో చేసిన మంచిమంచి వీడియోలే. అందువల్ల సినిమాల్లోకి రావడం పెద్ద వింతా కాదు, విచిత్రమూ కాదు. భవిష్యత్తులో లో గతించిన గొప్ప హీరోలతో మళ్లీ సినిమాలు వచ్చినా రావచ్చు. సీనియర్ ఎన్టీఆర్ ను గతంలో జూనియర్ ఎన్టీఆర్ తో కనిపించేలా చేసారు దర్శకుడు రాజమౌళి. ఫ్యాన్స్ ఆనందంతో ఉప్పొంగారు. అది జస్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ తో చేసిన చమక్కు. అదే కనుక ఏఐ తో చేస్తే.. ఇంకా అత్యంత సహజంగా వుంటుంది.
అఖండ 2 లో అలాంటి ప్రయోగం చేసారని టాక్ వినిపిస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ ఓ సీన్లో శివుడిగా అఖండ 2 లో కనిపిస్తారని బలంగా వినిపిస్తోంది. కానీ ఇలాంటిది ఏదీ లేదని మేకర్లు చెబుతున్నారు. అయితే సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ చెబుతూ, సీనియర్ ఎన్టీఆర్ వున్నారని టాలీవుడ్ లో కొందరు బలంగా వివరిస్తున్నారు. ఎవరి మాట నిజమో మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.




















కామెంట్స్ (1)
“నిజం ఏదో… త్వరలో తెలుస్తుంది!”