
క్రీడలు

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాకు సంబంధించిన వివరాలను రవితేజ వెల్లడించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో హసిత్ గోలి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘దాగుడు మూతల దండాకోర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో రవితేజ అభిమానుల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది.
కొత్త తరహా వినోదాత్మక కథతో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శ్రీవిష్ణు మరో కీలక కథానాయకుడిగా నటించనున్నాడనే ప్రచారం ఉన్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే నటీనటులు, కథకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!