

టాలీవుడ్–బాలీవుడ్ కలయికలు ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. పాన్-ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేస్తుండడంతో ఇలాంటి కాంబినేషన్స్ పెరుగుతున్నాయి. ఎన్టిఆర్ – హృతిక్ రోషన్ కాంబో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పని చేయకపోయినా… స్టార్ కెమియో ట్రెండ్ మాత్రం ఇంకా బాగా పెరుగుతోంది. ఇప్పుడు తాజా టాక్ ఏంటంటే… బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ ప్రభాస్‌తో కలసి పనిచేసే ఛాన్స్ ఉందట. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ భారీ ప్రాజెక్ట్ “స్పిరిట్” ఇటీవలే లాంచ్ అయ్యింది.
ఇంటర్నెట్లో అయితే రన్బీర్ కపూర్ ఈ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ చేసే అవకాశం ఉందని హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్–రన్బీర్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఇదే మొదటిసారి అవుతుంది. కాని ఇది ఫుల్‌లెంగ్త్ రోల్ కాదు… రన్బీర్ కపూర్ కేమియో రోల్లో కనిపిస్తాడట. రన్బీర్ కపూర్‌కి సందీప్ రెడ్డి వంగా తో చాలా మంచి బాండ్ ఉంది. ఇద్దరూ కలిసి చేసిన “యానిమల్" బ్లాక్‌బస్టర్ అయిన విషయం తెలిసిందే. “స్పిరిట్” పూర్తయ్యాక సందీప్ తర్వాత చేయబోయేది “యానిమల్ పార్క్” అనే సీక్వెల్.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!