
క్రీడలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంటగా తెరకెక్కుతున్న ‘రణబలి’ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లో విజయ్ దేవరకొండ డిఫరెంట్ గెటప్‌లో కనిపించగా, రష్మిక సైతం ప్రత్యేక లుక్‌లో ఆకట్టుకుంది. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ మరోసారి హైలైట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి అంచనాలు సృష్టించింది.
1850ల కాలాన్ని నేపథ్యంగా తీసుకుని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. రష్మిక అమాయకురాలైన యువతి పాత్రలో కనిపించనుండగా, విజయ్ దేవరకొండ కొత్త తరహా పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది. సీమ యాసలో సంభాషణలు ఉంటాయా అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. తాజాగా విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!