

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ తొలి రోజే బాక్సాఫీస్ వద్ద మంచి ఆరంభాన్ని అందుకుంది. అక్టోబర్ 16న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.16.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సాక్నిల్క్ వివరాల ప్రకారం, భారత్లో రూ.9.25 కోట్ల నెట్, రూ.10.75 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవర్సీస్లో రూ.5.75 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం.
తొలి రోజు థియేటర్లలో ఈ సినిమా మొత్తం ఆక్యుపెన్సీ 57 శాతంగా నమోదైంది. ముఖ్యంగా తెలుగు 2డీ వెర్షన్కు రాత్రి షోలలో 67.92 శాతం ఆక్యుపెన్సీ లభించింది. విజయ్ దేవరకొండ గత చిత్రాలైన ‘లైగర్’, ‘ఖుషి’, ‘కింగ్డమ్’తో పోలిస్తే ‘రణబాలి’ తొలి రోజు వసూళ్లు తక్కువగా ఉన్నప్పటికీ, ‘ది ఫ్యామిలీ స్టార్’ ఓపెనింగ్ను అధిగమించినట్లు ట్రేడ్ గణాంకాలు సూచిస్తున్నాయి.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ‘రణబాలి’ 1876–78 నాటి మహా మద్రాస్ కరువు, బ్రిటిష్ వలస పాలన నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ రణబాలిగా, రష్మిక మందన్న జయమ్మగా నటించారు. తొలి రోజు వసూళ్లతో ఆరంభం అందుకున్న ఈ సినిమా, వారాంతంలో ప్రేక్షకుల స్పందనను బట్టి మరింత వసూళ్లు సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!