

టాలీవుడ్లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్‌గా పేరున్న రామ్ పోతినేని, ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నవంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా ట్రైలర్ మంచి స్పందనను అందుకుంటోంది.
ఇంకా రామ్ తదుపరి ప్రాజెక్టులపై కూడా ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, దేవర చిత్రాన్ని నిర్మించిన యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌తో రామ్ ఒక కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి దర్శకుడు ఎవరు? కథ ఏంటి? అనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇక ఆంధ్ర కింగ్ తాలూకా విషయానికి వస్తే—
ఈ చిత్రాన్ని దర్శకుడు మహేష్ బాబు పి రూపొందించగా, నవంబర్ 27న తెలుగు, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!