

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక భారీ యాక్షన్ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి జోర్డాన్ ఎడారిలో భారీ షెడ్యూల్ కొనసాగుతోంది. అక్కడ ఎన్టీఆర్‌పై స్టైలిష్ ఫైట్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, టోవినో థామస్ విలన్‌గా కనిపించనున్నాడన్న టాక్ ఉంది. ఎన్టీఆర్ – టోవినో మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో జూన్ 25 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఇప్పటివరకు ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ వినిపించినా, తాజాగా సోషల్ మీడియాలో కొత్త టైటిల్ టాక్ వైరల్ అవుతోంది. ఈ మూవీకి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ: ది ఫైటర్’ విడుదలై దశాబ్దం పూర్తవడంతో, టైటిల్‌ను మళ్లీ వాడుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే నిర్మాతలు ఇంకా అధికారికంగా ఏ టైటిల్‌ను ప్రకటించలేదు. మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా క్రేజీ అప్డేట్ వచ్చే అవకాశముందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!