

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ నెల చివర్లో యూరప్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అక్కడ రామ్ చరణ్‌పై ఒక పాటను చిత్రీకరించనున్నారు. ఆ పాటతో పాటు ఒక యాక్షన్ సీన్ కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా చాలా భావోద్వేగంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమా క్లైమాక్స్ ఓ భారీ ప్రమాదం కారణంగా హీరో పాత్రకి కాళ్ళు పోతాయని.. అయినప్పటికీ రన్నింగ్ లో హీరో ఛాంపియన్ అవుతాడని.. సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా, ఇప్పటి వరకూ చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే.. ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందట. బుచ్చిబాబు రాసిన ఈ సినిమా స్క్రిప్ట్ చాలా భిన్నమైందట. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి పెద్ది సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!