
జనరల్

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాకా’ చిత్రంపై రోజుకో కొత్త వార్త బయటకు వస్తూ భారీ అంచనాలు పెంచుతోంది. తాజాగా ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ సీన్ గురించి లీక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎగురుతున్న విమానంలో తెరకెక్కించే ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.
దర్శకుడు అట్లీ ఈ సన్నివేశాన్ని అత్యంత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. విజువల్స్, యాక్షన్, ఎమోషన్ మేళవింపుతో ఈ సీక్వెన్స్ ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వనుందని టాక్. మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!