

తన దగ్గరకు వచ్చిన ప్రతి అవకాశానికీ ఓకే చెప్పకపోయినా, ఉన్నట్టుండి అద్భుతమైన కథలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే నటి ప్రియాంక చోప్రా. త్వరలో మహేశ్‌బాబుతో కలిసి వారణాసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు ఆమె సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, గత కొద్ది రోజులుగా ప్రియాంక క్రిష్ 4లో భాగం కాబోతున్నారనే వార్తలు బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో నటించేందుకు ఆమె అంగీకారం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది.
క్రిష్ 4తో హిందీ చిత్రపరిశ్రమలోకి ఘనంగా తిరిగి రావాలని ప్రియాంక ఉత్సాహంగా ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్ హీరో హృతిక్ రోషన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా, తొలిసారిగా దర్శకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. అంతరిక్ష నేపథ్యం, టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. మానవాతీత శక్తులు కలిగిన క్రిష్‌తో ప్రియాంక మరోసారి తెరపై మెరవబోతున్నారా అన్నది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!