

ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (జక్కన్న) కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఈ భారీ యాక్షన్–అడ్వెంచర్ చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా మెరవనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే ప్రధాన పాత్రల వివరాలు రివీల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించనున్నారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై జక్కన్న త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం.
వారణాసి చిత్రాన్ని 2027 వేసవిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఏకంగా ఐదు పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!