

రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. కృష్ణంరాజు వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆయన గురించి తాజాగా ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో తన కలల ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన స్థలంలో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాయదుర్గంలో అతనికి అతిథి గృహం ఉండగా, ఆ ప్రాంతం బిజీగా మారడంతో మరో భారీ భవంతిని నిర్మించాలని నిర్ణయించుకున్నారట. గత ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములను కూడా ప్రభాస్ కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!