

‘కూలీ’ సినిమాలో చేసిన మోనికా… మోనికా సాంగ్తో పూజా హెగ్డే మళ్లీ స్పాట్లైట్లోకి వచ్చింది. ఈ పాటకు వచ్చిన భారీ రెస్పాన్స్ వల్ల ఆమె డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని టాక్.
ఇప్పుడు తాజాగా మరో పెద్ద రూమర్ సినీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.అల్లు అర్జున్,అట్లీ కాంబినేషన్లో వస్తోన్న భారీ బడ్జెట్ మూవీ (AA22xA6) లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తుందట!
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ 800 కోట్ల సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్లో పూజాకు ఏకంగా ₹5 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు చర్చ. అయితే, ఈ వార్తపై మూవీ టీమ్ ఎలాంటి అధికారిక క్లారిటీ ఇవ్వలేదు.
ఇక బన్నీ,పూజా జంటకు ఇది మూడో సినిమా అవుతుంది. ‘దువ్వాడ జగన్నాథమ్’, ‘అల వైకుంఠపురములో’ తర్వాత ఈ కాంబో మళ్లీ తెరపైకి వస్తోందన్న టాక్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.
మరి ఈ 5 కోట్ల డ్యాన్స్ డీల్ నిజమా, లేక పబ్లిసిటీ గిమ్మిక్ మాత్రమేనా? అధికారిక అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






.avif&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!