

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం భారీ అంచనాలతో ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పవన్ ఫ్యాన్స్‌కు పూర్తి స్థాయి వినోదం అందించేలా ఉంటుందని టాక్. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డితో ఒక సినిమా, సుజీత్‌తో ఓజి 2 వంటి ప్రాజెక్టులు ఇప్పటికే లాక్ అయ్యాయి. అంతేకాదు, పవన్ వద్ద ఇంకా పలు నిర్మాణ సంస్థల డేట్స్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ జాబితాలో చేరిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ టాప్ బ్యానర్ మరేదో కాదు యూవీ క్రియేషన్స్. ప్రస్తుతం ఈ సంస్థ మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో రామ్ చరణ్‌తో కూడా ఒక సినిమా చేయాలనుకున్నారు కానీ అది కుదరలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా ఉంటుందనే ప్రచారం మొదలైంది. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతం పవన్ ఎలాంటి సినిమా షూటింగ్లో పాల్గొనడం లేదు. కాబట్టి ఈ ఆసక్తికరమైన కలయికపై స్పష్టత రావాల్సి ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!