

హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘స్వయంభు’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి పిరియాడికల్ మైథాలజిక్ చిత్రంగా రాబోతుంది.
ఇప్పుడు వినిపిస్తున్న క్రేజీ న్యూస్ ఏమిటంటే, ఈ సినిమాలో నిఖిల్ ఇంట్రో సీన్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని చెబుతున్నారు. రాజు పాత్రలో ఉన్న నిఖిల్ ఒక వార్ సీక్వెన్స్‌లో సినిమాకు గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని. ఈ సీక్వెన్స్‌లోని విజువల్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది.
సినిమా ఫిబ్రవరి 13, 2026న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె. కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ ఆధ్వర్యంలో భువన్ మరియు శ్రీకర్ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాను నిర్మాత ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!