
.png&w=3840&q=75)
నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంటి సినిమాలతో నటుడిగా మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు కదా. ఇప్పుడు తన కొత్త సినిమా “అనగనగా ఒక రాజు” కోసం సింగర్‌గా మారిపోతున్నాడు. సంక్రాంతి 2026కి ది రాజా సాబ్, మన శంకర వర ప్రసాద్ గారు లాంటి పెద్ద సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నా నవీన్ పొలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజు మీద కూడా మంచి బజ్ ఉంది.
ప్రతీ ఒక్కరూ ఈ సినిమాపై చాలా పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు "ఇది సర్ప్రైజ్ బ్లాక్‌బస్టర్ అవుతుందేమో" అన్న టాక్ వస్తోంది. ప్రమోషన్స్ కూడా నవీన్ స్టైల్లో ఫుల్ ఎంటర్టైనింగ్గా, అందరికీ చేరేలా ప్లాన్ చేశాడు.
ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నవీన్ పొలిశెట్టి ఈ సినిమాకి ఓ మాస్ సాంగ్ పాడుతున్నాడట! ఆ సాంగ్ ఈ నెలలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ మీనాక్షి చౌదరి. సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వస్తోంది. జనవరి 14, 2026 న థియేటర్లలో రిలీజ్ అవ్వబోతోంది.


_1771477764226.jpg&w=3840&q=75)












కామెంట్స్ (1)
Can’t wait for the mass song