

ఇది జనాల మధ్య నలుగుతున్న గాసిప్ కాదు. అలా నలిగే పుకార్లను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇది స్వయానా ఇండస్ట్రీ మనుషుల మధ్య వినిపిస్తున్న టాక్. అందుకే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను అనిల్ రావిపూడి వెండితెరకు పరిచయం చేయబోతున్నాడట. అది కూడా స్వయంగా బాలకృష్ణ రాసిన ఆదిత్య-999 ప్రాజెక్టుతో చాలా క్రేజీగా ఉంది కదా. మరి క్రిష్ సంగతేంటి?
బాలయ్య కొడుకుని క్రిష్ లాంఛ్ చేస్తాడనే ప్రచారం కొన్ని రోజులుగా నడిచింది. ఆదిత్య-999 ప్రాజెక్టును ఇతడే హ్యాండిల్ చేస్తాడని అంతా అనుకున్నారు. అయితే తన ట్రాక్ రికార్డ్ దృష్ట్యా క్రిష్ గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. దీంతో అనిల్ రావిపూడి పేరు తెరపైకొచ్చింది. ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్న ఈ దర్శకుడు, తన తదుపరి ప్రాజెక్టుగా దీన్నే టేకప్ చేసే అవకాశం ఉందంటున్నారు చాలామంది.
తనకు భగవంత్ కేసరి లాంటి డిఫరెంట్ మూవీ అందించిన రావిపూడి, మోక్షజ్ఞకు కూడా మంచి లాంఛింగ్ ఇస్తాడని బాలయ్య నమ్ముతున్నారట. పైగా ఇందులో ఆయన కూడా నటించబోతున్నారు. త్వరలోనే ఈ గాసిప్ పై ఓ క్లారిటీ వస్తుంది. మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానంటూ ఇదివరకే ప్రకటించాడు రావిపూడి. ఓ కొత్త హీరోతో వర్క్ చేయడం, పైగా సైన్స్ ఫిక్షన్ సినిమా కావడం రెండూ అనిల్ రావిపూడికి కొత్తే.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!