

మిడ్ రేంజ్ సినిమా వేరు. భారీ సినిమా వేరు. మిడ్ రేంజ్ సినిమా, మిడ్ రేంజ్ హీరో, కానీ ఖర్చు మాత్రం భారీ అంటే కష్టలే కదా. ఈ రెండూ కలిసాయి అంటే మార్కెట్ ఇంకా చాలా కష్టం. ఫ్లాపులు తప్ప హిట్లు అంటే వికీపీడియా మొత్తం గాలించాల్సిన ఓ మిడ్ రేంజ్ హీరో సినిమా ఒకటి వుంది. అసలు ప్లాన్ చేయడమే తప్పు అయినా చేసారు తీరా చేసిన తరువాత ఖర్చు చూస్తే భారీ సినిమా రేంజ్ కు చేరేలా కనిపిస్తోంది. దాంతో నిర్మాత వెళ్లి హీరోతో డిస్కషన్ పెట్టారని తెలుస్తోంది. ఏం చేద్దాం రెమ్యూనిరేషన్ ఏమైనా కాస్త తగ్గించుకుంటారా అని నిర్మాత అడగ్గా ఎన్ని ఫ్లాపులు ఖాతాలో వున్నాయి అన్నది కాదు కీలకం, నా ఖాతాలోకి నా రెమ్యూనరేషన్ వచ్చిందా లేదా అన్నదే పాయింట్ అనేట్లుగా ఆ హీరో సైలంట్ అయిపోయారని తెలుస్తోంది. ప్రస్తుతానికి షూటింగ్ ఆపి కూర్చున్నారట.
అంతే కాదు, తనే చొరవ తీసుకుని ఆ ప్రాజెక్ట్ ను వేరే నిర్మాత చేతిలో పెట్టే పనిలో పడ్డారట. ఇలా చేయడం వల్ల రెండు పనుల్లో ఏదో ఒకటి జరుగుతుందన్నది హీరో ఆశ. ఒకటి మొదటగా ప్లాన్ చేసిన నిర్మాతకు పౌరుషం, పోటీ వచ్చి తానే సినిమాను ఎంత ఖర్చయినా భరించి పూర్తి చేయవచ్చు. లేదా ప్రాజెక్ట్ మరో నిర్మాత చేతిలోకి వెళ్తే, తన సినిమా తనకు వుంటుంది. తన రెమ్యూనిరేషన్ తనకు వస్తుంది. కానీ ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ను ఎవరో ఒకరు గట్టెక్కించడం మాత్రం జరగాలి.







.png&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!