

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం Mega158 ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ బజ్‌ను సృష్టిస్తోంది. తాజాగా వెలువడుతున్న క్యాస్టింగ్ అప్డేట్స్తో అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. చిరంజీవి లీడ్ రోల్లో కనిపించనుండగా, మలయాళ సినీ లెజెండ్ మోహన్‌లాల్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారనే వార్త పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తిని రేపుతోంది.
విలన్ పాత్రకు బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఎంపికయ్యారనే టాక్ హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యామిలీ ఎమోషన్‌కు బలం చేకూర్చే పాత్రలో ప్రియమణి నటించనుండగా, చిరంజీవి కుమార్తె పాత్రలో యంగ్ టాలెంట్ సారా అర్జున్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబీ బలమైన టెక్నికల్ టీమ్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారని, ఈ పవర్ఫుల్ క్యాస్టింగ్‌తో Mega158 విడుదలైన రోజే భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!