

దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం “డ్రాగన్”పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న ప్రత్యేక గ్లింప్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాలుగు నిమిషాలకు పైగా నిడివితో రూపొందించిన ఈ ప్రత్యేక వీడియోలో సినిమా ప్రపంచం, మాఫియా వ్యవస్థ, ప్రాంతీయ రాజకీయాల నేపథ్యాన్ని స్పష్టంగా చూపించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే “సలార్” చిత్రంలో కథా ప్రపంచంపై కొంతమంది ప్రేక్షకులకు గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో, ఈసారి పూర్తి స్పష్టతతో కథను పరిచయం చేయాలని ప్రశాంత్ నీల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్‌లో ఎన్టీఆర్‌ను పవర్‌ఫుల్‌గా చూపించడంతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు, డార్క్ టోన్ దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఒక్క గ్లింప్స్‌తోనే దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆసక్తి పెంచాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!