

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు అభిమానుల నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది.
ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కు మేకర్స్ సిద్ధమయ్యారు. జనవరి 4 న తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ క్యామియో పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!