

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వచ్చే సినిమాల లైనప్‌పై స్పష్టత క్రమంగా వస్తోంది. ఇటీవల దేవర 2 డిసెంబర్లోనే సెట్స్ పైకెళ్తుందని వార్తలు వినిపించినా, అవి నిజం కాదని తేలిపోయింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ప్రాజెక్ట్‌పైనే దృష్టి పెట్టారు. ఈ సినిమా ఎలాంటి బ్రేక్‌లూ లేకుండా వరుస షెడ్యూళ్లతో పూర్తి చేయబోతున్నారు.
ఇది పూర్తయ్యాక మొదట సితారా–నీల్సన్ సినిమా, తర్వాత త్రివిక్రమ్ సినిమా అనే ప్లాన్ ఉండేది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ లైనప్‌లో మార్పు వచ్చింది. ఇప్పుడు ముందుగా త్రివిక్రమ్ సినిమా, దాని తర్వాతే నీల్సన్ సినిమా చేయనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఒక సినిమా, త్రివిక్రమ్ మరో సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయ్యాక ఈ ఇద్దరూ కలిసి ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.
కుమారస్వామి పురాణగాథ ఆధారంగా త్రివిక్రమ్ సిద్ధం చేసిన మైథలాజికల్ ఫాంటసీ కథ, మొదట బన్నీ కోసం డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్ చివరకు ఎన్టీఆర్‌కి వచ్చినట్టు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!