
.png&w=3840&q=75)
కొన్ని నెలలుగా మీడియాలో భారీగా రూమర్స్ వినిపిస్తున్నాయి కొరియన్ సూపర్ స్టార్ మా డోంగ్-సియోక్ (Don Lee అని కూడా పిలుస్తారు) ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “స్పిరిట్” సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారని. అయితే ఇప్పటివరకు మేకర్స్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించలేదు. ఇక తాజాగా కొరియన్ మీడియా నుంచి వచ్చిన రిపోర్ట్స్ మాత్రం ఈ వార్తను కన్ఫర్మ్ చేశాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారం, డాన్ లీ తన ఇండియన్ సినిమా డెబ్యూని “స్పిరిట్” ద్వారా చేయబోతున్నాడని, ఇటీవల ఆయన భారత్కి వచ్చినదానికి కూడా ఇదే కారణమని చెబుతున్నాయి. ఈ సినిమాలో డాన్ లీ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ వార్త విన్న ప్రభాస్ అభిమానులు ఆనందంతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
కొరియన్ మీడియా హౌస్ ముకో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం “స్పిరిట్ అనే ఈ చిత్రం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బాహుబలిగా పేరుగాంచిన ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా డార్క్ టోన్ డిటెక్టివ్ క్రైమ్ డ్రామా లా ఉండబోతోంది. ఇందులో డోంగ్-సియోక్ పాత్ర ప్రభాస్ పాత్రకి వ్యతిరేకంగా ఉంటుంది” అని పేర్కొంది. ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత, స్పిరిట్ మేకర్స్ అధికారికంగా డాన్ లీ ఎంట్రీని ప్రకటిస్తారా లేదా అన్నది చూడాలి. ఇప్పటివరకు స్పిరిట్ సినిమాలో కన్ఫర్మ్ అయిన నటీనటుల్లో త్రిప్తి దిమ్రి, ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ ఉన్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభం కానుంది.










కామెంట్స్ (2)
Blockbuster loading..
darling never disappoints us