

ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ మరియు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ అంశంపై అనిరుధ్ స్పందించిన తీరు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.
గత సంవత్సరం జూన్‌లో కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. అప్పట్లో కావ్య మరియు అనిరుధ్ కలిసి అమెరికా వెళ్లారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ సమయంలో అనిరుధ్ ఈ రూమర్స్‌ను ఖండిస్తూ, “పెళ్లా? హాహా… ప్లీజ్ గైస్, కాస్త కూల్ అవ్వండి. ఇలాంటి వార్తలు వ్యాప్తి చేయడం ఆపండి” అంటూ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఇటీవల ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనిరుధ్‌ను మరోసారి పెళ్లి విషయంపై ప్రశ్నించగా, “మళ్లీ ఇదేనా?” అంటూ అసహనం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈసారి ఆయన పూర్తిగా ఖండించకపోవడం వల్ల ఇద్దరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.
అయితే, ఈ వివాహంపై ఇప్పటివరకు కావ్య మారన్ లేదా అనిరుధ్ కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం కావ్య మారన్ దృష్టి మొత్తం ఐపీఎల్ 2026 సీజన్‌పైనే ఉంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. మరోవైపు అనిరుధ్ వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు.




.jpeg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!